WELCOME TO MASTER'S COMPUTER EDUCATION

Dear Students All The Best In Your Exams

Wednesday, 12 October 2016

కంప్యూటరు వాడని సమయంలో ఆపివేయాలా?

కంప్యూటరు వాడని సమయంలో కచ్చితంగా ఆపివేయాలా? అలానే ఆన్‌లో ఉంచితే ప్రమాదమా?
దీనికి సమాధానం, మీరు మీ కంప్యూటర్‌ను వాడే విదానం పైన ఆధారపడి ఉంటుంది.
సాధారణ వాడుకరులకు సమాధానం : మీరు మీ కంప్యూటర్ వాడని సమయంలో, దానిని అపివేయండి.
సాధారణంగా రోజంతా కంప్యూటర్‌ను ఆన్ చేయ వలసిన పరిస్థితులు :
1. ఏదైనా పెద్ద ఫైల్‌ను ఇంటెర్నెట్ నుండీ డౌంలోడ్ చేస్తున్నట్టైతే.
2. ఆపేస్తే, మళ్ళీ ఆన్ కావటానికి సమయం పడుతుంది కదా అని అలానే వదిలేస్తే!!
మొదటి పరిస్థితిలో ఇది అనివార్యం.
ఇక రెండవ పరిస్థితిలో, అనవసర సమయాల్లో ఆన్ చేసి ఉంచటం వల్ల కంప్యూటరు యొక్క జీవిత కాలం కుదించుకుపోతుంది. ప్రతిసారీ ఆన్-ఆఫ్ చేయటం వల్ల కలిగే వత్తిడి కూడా దాని జీవిత కాలాన్ని క్షీణిపజేస్తుందనుకోండి. కానీ ఇలా కంప్యూటరు చెడిపోవటానికి మునుపే, వచ్చిన కొత్త టెక్నాలజీ వల్ల అది పతదైపోతుంది. ఆన్-ఆఫ్ చేయటం వల్ల కలిగే వత్తిడికంటే అతిగా వేడెక్కటం వల్ల కలిగే ప్రమాదమే ఎక్కువ.
విద్యుత్తు :
రోజంతా ఆన్‌లో ఉంచినప్పుడు, మీరు 4 గంటలు వాడితే మిగిలిన 20 గంటలు కరెంటు వృధా అవుతుంది. సాధారణంగా ఒక కంప్యూటర్ (ల్యాప్ టాప్‌లు మినహా) 300 వాట్ల కరెంటును వాడుకుంటుంది. అంటే దాదాపుగా 8 ట్యూబ్ లైట్లను వాడినంత విద్యుత్తు వాడుతుంది. అంటే యూనిట్టుకు మూడు రూపాయల చొప్పున నెలకు 540 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మనం కంప్యూటర్ ముందు కూర్చోన్న సమయంలో మానిటర్ అపేసి ఉంచటం వల్ల కర్చు చేసే విద్యుత్తులో సగానికి సగం అదా చేయవచ్చు.
చిట్కాలు (మీరు కంప్యూటర్ వాడుతున్నప్పుడు):
1. వచ్చే 20 నిమిషాలు కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, మానిటర్ను అపివేయండి.
2. వచ్చే 2 గంటలలో కంప్యూటర్ వాడబోరు అన్నటైతే, కంప్యూటర్‌ను పూర్తిగా అపివేయండి.
3. త్వరగా ఆన్ కావాలంటే, స్లీప్ మోడ్ లేదా స్టాండ్ బై లో  ఉంచటం చాలా రకాలుగా మంచిది.
స్క్రీన్ సేవర్లు విద్యుత్తు ఆదాకు తోడ్పడవు!

No comments:

Post a Comment